విజయనగరం జిల్లా గరివిడిలో పట్టాదారు పాసు బుక్కులు కోసం.. డబ్బులు డిమాండ్ చేస్తూ.. రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెరకముడిదం మండలం సిరిపురం గ్రామానికి చెందిన బీసీ అనే రైతు.. తన పొలానికి సంబంధించిన పాత పాస్ బుక్ పాడవటంతో.. కొత్త పాస్ పుస్తకాల కోసo దరఖాస్తు చేసుకున్నాడు. రైతుకు కొత్త పాస్ బుక్లు ఇచ్చేందుకు గాను విఆర్ఓ 3000 రూపాయలు డిమాండ్ చేశాడు. గరివిడి మండల తాహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారుడు నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి…: షాకింగ్: ఒకే గ్రామంలో 37 మందికి కరోనా