విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెల్లివీధి పెయిన్ దొర పేటలో నివాసం ఉంటున్న అమర్ ప్రసాద్... 10వ తరగతి వరకు చదువుకుని సమీప ఫిషింగ్ హార్బర్లో ప్యాకింగ్ విభాగంలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం నుంచి అమర్ ప్రసాద్ ఆచూకీ లేని కారణంగా అతని తల్లి స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
4వ తేదీన ఫిషింగ్ హార్బర్ సమీపంలోని పాత ఐస్ ఫ్యాక్టరీ భవనంలో అమర్ ప్రసాద్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒంటిపై రక్తపు మరకలతో మృతదేహాం ఉండటంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
పట్టాభిపై దాడి కేసు: రౌడీ షీటర్ పాత్రపై ఆరా.. ఇంట్లో ఉండి కథ నడిపించాడా..?