ETV Bharat / state

రవాణా సౌకర్యం లేదు.. వీల్​చైరే దిక్కైంది! - a women travels for dialysis on wheel chair to kgh at vishakapatnam

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వైరస్​కు బలవుతుంటే.. మరోవైపు ఆస్పత్రుల్లో వివిధ వ్యాధులకు చికిత్స పొందే రోగులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో...ఇది వరకే ఉన్న వ్యాధులకు చికిత్స చేయించుకోలేకపోతున్నారు. గడప దాటని పరిస్థితుల్లో నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖకు చెందిన ఓ మహిళ...వీల్ చైర్​లో డయాలిసిస్ చికిత్స కోసం పది కిలోమీటర్లపాటు వెళ్లి వస్తోంది.

a women travels for dialysis on wheel chair at vishakapatnam
వీల్​చైర్​పై పది కిలో మీటర్లు ప్రయాణించిన బాధితురాలు
author img

By

Published : Apr 7, 2020, 12:45 PM IST

వీల్​చైర్​పై పది కిలో మీటర్లు ప్రయాణించిన బాధితురాలు

విశాఖకు చెందిన కనకమహాలక్ష్మి, బసవయ్య దంపతులు.. ప్లాస్టిక్ సామగ్రిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కడు పేదరికంలో ఉన్న వారికి మరో కష్టం తోడైంది. కనకమహాలక్ష్మికి కిడ్నీలు చెడిపోయాయి. ఈ క్రమంలో విశాఖలోని విమ్స్​లో డయాలసిస్ చేయించుకునేది. కరోనా లాక్ డౌన్... ఆమె పాలిట శాపంగా మారింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... విమ్స్​ను ప్రత్యేక ఆస్పత్రిగా గుర్తించగా... వైద్యులు ఆమెను కేజీహెచ్​లో వైద్యం చేయించుకోవాలని సూచించారు. కానీ లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం స్తంభించిపోయింది. ఈ కారణంగా.. ఆమె కేజీహెచ్​కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమె నివసించే అరిలోవ నుంచి వీల్​ చైర్​లో పది కిలో మీటర్ల మేర భర్త బసవయ్య సహాయంతో కేజీహెచ్​కు వెళ్లి వైద్యం చేయించుకుంటోంది.

'రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి నాలుగు సార్లు వీల్ చైర్​పైనే కేజీహెచ్​కు వెళ్లాం. వైద్యం అందకపోతే బ్రతుకలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి'

-కనకమహాలక్ష్మి, బాధితురాలు

ఇదీ చదవండి:

కరోనా ఎఫెక్ట్: మోదకొండమ్మకు వేపనీళ్లతో అభిషేకం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.