విశాఖ మన్యంలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. అదనపు డీజీ రష్మీ శుక్లా, ఐజీ మహేశ్ చంద్ర లడ్డా నేతృత్వంలో అధికారుల పర్యటన సాగుతోంది. అన్నవరం, చింతపల్లి, జి.మాడుగులలోని సీఆర్పీఎఫ్ క్యాంపులను పరిశీలిస్తున్నారు. జులై 1న మావోయిస్టుల బంద్ పిలుపు వల్ల ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తీగలమెట్ట వద్ద ఎదురుకాల్పులకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో మన్యంలోని పరిస్థితులపై సీఆర్పీఎఫ్ జవాన్లతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జవాన్లకు పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: ఉన్నత ఉద్యోగం.. అయినా భార్యతో కలిసి..!