ETV Bharat / state

Remand prisoner died: ఎలమంచిలి సబ్ జైల్లో.. రిమాండ్​ ఖైదీ మృతి

జైల్లో ఉంటున్న రిమాండ్​ ఖైదీ మృతి చెందిన సంఘటన ఎలమంచిలిలో జరిగింది. కారాగారంలోనే ఫిట్స్​ రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుడు నాటుసారా తెచ్చుకుంటుండగా పోలీసులు అరెస్టు చేశారు.

remand prisoner died
ఎలమంచిలి సబ్ జైల్లో ఉంటున్న రిమాండ్​ ఖైదీ మృతి
author img

By

Published : Aug 10, 2021, 3:51 PM IST

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి సబ్ జైల్లో ఈరోజు రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. ఇటీవల నాటుసారా కేసులో అరెస్టయిన సూరంపూడి శివ (25) అనే వ్యక్తిని.. కోర్టు ఆదేశాల మేరకు ఎలమంచిలి సబ్ జైల్​కు పోలీసులు తరలించారు. గత శుక్రవారం నుంచి శివ.. సబ్ జైల్లో ఉంటున్నాడు. ఈరోజు ఉదయం ఫిట్స్ రావడంతో జైలు సిబ్బంది ఇతనిని వెంటనే ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కొక్కిరాపల్లి గ్రామానికి చెందిన శివ.. నాటుసారా తాగడానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో.. సారా తెచ్చుకుంటూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. రిమాండ్ లో ఉంటుండగా ఫిట్స్ రావడం తో చనిపోయాడని ఎలమంచిలి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు మృతదేహానికి వైద్యుల బృందం శివ పరీక్షలు నిర్వహించారు. అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు ఈ మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరిపించారు.

ఆయన రెండు గంటల పాటు ఇక్కడ ఉండి సమగ్ర వివరాలు సేకరించారు. రిమాండ్ ఖైదీ మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సీఐ వెంకటరావు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను కొక్కిరాపల్లిలో వ్యవసాయ కూలీలుగా పనిచేసేవాడు.

ఇదీ చదవండి:

FIGHT: విశాఖలో యువకుల మధ్య ఘర్షణ.. బీర్ సీసాలతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.