విశాఖ అపోలో వైద్యులు అరుదైన గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ట్రాన్స్ కేథటర్ అర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టవీ)గా పిలిచే చికిత్సను 69 ఏళ్ల వ్యక్తికి నిర్వహించి అరుదైన ఘనతను సాధించారు. ఈ చికిత్సతో బెలూన్ మౌంటెడ్ స్టెంట్ వాల్వ్ ను చెడిపోయిన అయార్టిక్ వాల్వ్ అనే కవాటము స్థానంలో అమర్చారు.ఈ తరహా స్టెంట్ వాల్వ్ మొదట అమర్చిన ఘనత తెలుగు రాష్ట్రాల్లో అపోలో ఆసుపత్రికే దక్కిందని వైద్యులు వెల్లడించారు.
ఇదీచదవండి