ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారం... ఎం చేశాడంటే..! - Gold bag found on a bus in Visakhapatnam

తనకు దొరికిన బంగారాన్ని ఓ వ్యక్తి భద్రంగా పోలీసులకు అప్పగించాడు. మొత్తంగా 454 గ్రాముల బంగారాన్ని అప్పగించి అందరిచేత శెభాష్​ అనిపించుకున్నాడు. అతడి గొప్ప మనస్సుకు మురిసిపోయిన డీసీపీ ఘనంగా సన్మానించాడు. ఈ ఘటన విశాఖలో జరిగింది.

Gold bag found in RTC bus
ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు బ్యాగు
author img

By

Published : Jul 25, 2021, 9:46 PM IST

విశాఖకు చెందిన ఆర్టీసీ బస్సులో దొరికిన 454 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించాడు ఓ వ్యక్తి. మధురవాడ మారికవలస ప్రాంతానికి చెందిన పోలుబోతు దుర్గారావు బంగారం పనులు చేస్తుంటాడు. శ్రీకాకుళంలోని వ్యాపారుల నుంచి ముడి బంగారాన్ని తెచ్చి విశాఖ కురుపాం మార్కెట్ వద్ద ఆభరణాలు చేసి విక్రయిస్తుంటాడు. ఎప్పటిలాగే నిన్నరాత్రి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ముడి బంగారాన్ని తీసుకుని ఆర్టీసీ బస్సులో విశాఖకు బయల్దేరాడు. బస్సు రాత్రి 8గంటల ప్రాంతంలో మధురవాడ చేరుకుంది. అతను బస్సు దిగే క్రమంలో బంగారం ఉన్న బ్యాగుని చూసుకున్నాడు. అది కనిపించకపోవటంతో కంగారుపడుతూ మధురవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన అంబటి పోలరాజు తనకు బంగారంతో కూడిన బ్యాగు దొరికిందంటూ పోలీసులకు సమాచారమిచ్చాడు. బాధితుడ్ని స్టేషనుకు పిలిచి బంగారం లెక్కలను సరిచూశారు పోలీసులు. దాదాపు 27 లక్షలు విలువైన 454 గ్రాముల బంగారాన్ని తిరిగిచ్చిన ఆ వ్యక్తిని అభినందించారు. అనంతరం క్రైమ్ డీసీపీ సురేష్ బాబు సమక్షంలో మధురవాడ పోలీస్ స్టేషన్లో బంగారం బ్యాగును తిరిగిచ్చిన పోలారాజును సత్కరించారు.

ఇదీ చదవండీ.. Ramappa Temple: రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.