ETV Bharat / state

MURDER: వ్యక్తి హత్య.. వివాహేతర సంబంధమేనా? - విశాఖ హత్య

విశాఖ వన్​టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పండావీధికి చెందిన భవానీ.. ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య (brutally murdered) చేసింది. నిందితురాలి తండ్రి సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

murder at vishaka
విశాఖలో దారుణ హత్య
author img

By

Published : Sep 19, 2021, 10:46 AM IST

Updated : Sep 19, 2021, 7:33 PM IST

ఓ వ్యక్తిని మహిళ హతమార్చిన ఘటన శనివారం అర్ధరాత్రి విశాఖలో చోటు చేసుకుంది. నాయిని సంతోశ్​(30) అనే వ్యక్తి.. భార్యాపిల్లలతో కలిసి విశాఖలోని మధురవాడలో నివాసముంటున్నాడు. సంతోశ్​.. పండావీధిలోని సహీల్ ట్రేడింగ్ కంపెనీలో పని చేసేవాడు. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న భవానీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భవానీ ఫోన్ చేసి సంతోశ్​ను ఇంటికి పిలిచింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భవానీ.. సంతోశ్​ను కత్తితో పొడిచి హతమార్చింది.

వీరి మధ్య వివాహేతర సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. నిందితురాలి తండ్రి సమాచారం మేరకు వన్​టౌన్ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని భవానీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి..

విధుల పట్ల అంకితభావమే... వాగు దాటొచ్చేలా చేసింది..!

Last Updated : Sep 19, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.