విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై రాత్రి ప్రమాదవశాత్తు ఓ లారీ దగ్ధమయ్యింది. తెలంగాణలోని కోదాడ నుంచి అనకపల్లికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ.. టోల్ గేట్ వద్ద ఆగింది. ఈ క్రమంలో డ్రైవర్ భోజనం చేస్తుండగా లారీలోని ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే వాహనాన్ని చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది..ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం చాలా మేర కాలిపోయింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఇదీ చదవండి..