విజయనగరం జిల్లాకు చెందిన ఓ సంస్థ సుమారు 30 కోట్ల రూపాయలకు నకిలీ బిల్లులు సృష్టించినట్లు విశాఖపట్నంలోని జీఎస్టీ నిఘా డైరెక్టర్ జనరల్ కార్యాలయ (డీజీజీఐ) వర్గాలు గుర్తించాయి. 2017- 2020 జనవరి వరకు ఆయా నకిలీ రశీదులు సృష్టించి సుమారు 6 కోట్ల 'ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్' పొందినట్టు తేల్చాయి.
సీసం కడ్డీలు తయారు చేసే ఈ సంస్థకు దిల్లీ, హరియాణా, విశాఖపట్నంలో కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీజీఐ సంయుక్త సంచాలకుడు మయాంక్ శర్మ ప్రకటించారు. సరకు కొనుగోలు చేయకుండానే బిల్లులు సృష్టించారని తెలిపారు. నేరం ప్రాథమికంగా నిరూపితమైందని.. సంస్థ డైరెక్టర్‌ను మంగళవారం అరెస్టు చేశామని చెప్పారు. న్యాయస్థానం అతనికి ఈనెల 18వ తేదీ వరకు రిమాండు విధించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: