- ఆస్తులు కాపాడబోయాడు.. పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు
తాను పనిచేస్తున్న సంస్థ ఆస్తులను కాపాడటమే ఆ అధికారికి శాపంగా మారింది. ఆస్తులు పరిరక్షించిన అధికారి అంకితభావాన్ని ప్రశంసించకపోగా.. విధుల నుంచి తప్పించారు. బాపట్లలో కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలకు ఎదురు నిలిచిన డీఎం శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడంపై ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
- ఆమె కళ్ళలో ఆనందం కోసం.. రైతుల కళ్లలో కారం.. కానీ
రైతులకు చెల్లించాల్సిన నగదును తీసుకొస్తుంటే దొంగలు దోచుకున్నారంటూ.. సీన్ క్రియేట్ చేసి కేసును గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు ఛేదించారు. కంతేరు గ్రామానికి చెందిన గండం శ్రీనివాసరావు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న రైతులు వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేశాడు. మిల్లర్ నుంచి నగదు తీసుకొస్తుంటే పెద్దకాకాని మానస సరోవరం వద్ద ఇరువురు వ్యక్తులు దాడి చేసి 2లక్షలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- నెల్లూరులో ఐదేళ్ల చిన్నారి అదృశ్యం
నెల్లూరులో అయిదేళ్ల చిన్నారి అదృశ్యమైంది. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే భార్యాభర్తలు రాత్రి తమ ముగ్గురు పిల్లలతో కలిసి కుక్కలగుంట ప్రాంతంలోని నిద్రించారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా పాపే నిద్రలేచి ఏటైనా వెళ్ళిపోయిందా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఏపీటీఎఫ్
వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలకు ఫెడరేషన్ నేతలు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఫెడరేషన్ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM
.
ఏపీ ప్రధాన వార్తలు