విశాఖ ఏజెన్సీలో కోరకొండ సంత నుంచి చెరువు ఊరు వెళుతుండగా... విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొట్టింది. జూన్2న జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కుటుంబాలను పరామర్శించి సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అవి మాటలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వసాయం నుంచి ఐదు లక్షలు భీమా మరో ఐదు లక్షలు కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏడు నెలలు కావస్తున్నా గ్రామం వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. తమను తక్షణమే ఆదుకోవాలంటూ వితంతులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి