విశాఖ దొండపర్తిలో ఏర్పాటు చేసిన 54 అడుగుల భారీ మట్టి గణేశుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. 70 మంది యువకులు సంఘంగా ఏర్పడి ఈ భారీ లంబోదరుడి తయారీ పనులు చూసుకున్నారు. గంగానది నుంచి మట్టి తీసుకొచ్చి మూడు నెలల ముందు నుంచే తయారీ ప్రారంభించారు. గంగా మట్టి, కర్రముక్కలతో కలకత్తా నుంచి తీసుకొచ్చిన కళాకారులతో ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో ఈ ప్రయత్నం అనుకున్నా వీలు కాలేదని.. అందుకే ముందస్తు ప్రణాళికతోనే ఇప్పుడు ఏర్పాటు చేశామని వివరించారు. 21 రోజుల పాటు భక్తుల దర్శనార్ధం ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నట్లు వారు తెలిపారు. విగ్రహాన్ని సందర్శించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి అన్ని బాధ్యతలు యవజన సంఘ ప్రతినిధులే చూసుకుంటున్నారు. పూర్తి పర్యావరణహితంగా తయారైన ఈ విగ్రహాన్ని.. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయనున్నారు.
ఇదీ చదవండి : 1008 వంటకాలతో..గోపాలుడికి మహా నివేదన