విశాఖ మన్యం పాడేరు ఏజెన్సీలో ఎటువంటి ఆధారాలు లేకుండా కారులో నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హుకుంపేట పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న 18 లక్షల 30 వేల నగదు పట్టుబడింది. కాఫీ కొనుగోలుకు రైతులకు చెల్లించాల్సిన డబ్బు అని వాహనదారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం నగదు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అప్పల నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి : సినిమా థియేటర్లు మూసివేత... పాఠశాలలకు సెలవులు