విశాఖ మారుమూల ప్రాంతాల్లో గంజాయి తోటలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా గంజాయి తోటలు పసిగట్టి నరికి.. తగలబెడుతున్నారు. అతి పెద్ద తోటలను పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తిస్తున్నారు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ తాంగుల, రవిడిపుట్టు, కించోల్డ కొండల్లో అత్యధికంగా గంజాయి సాగు అవుతున్నట్లు గుర్తించారు. సుమారు 115 ఎకరాల్లో 17 కోట్ల రూపాయల విలువైన.. 5.75లక్షల మొక్కలను నరికి ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: