విశాఖ,తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఏజెన్సీ కష్టాలకు ఓ నిట్టనిలవు సాక్ష్యం కొండజర్త గ్రామం. ఎత్తైన కొండలు, గుట్టల నడమ చూడటానికి ఓ పర్యాటక ప్రాంతంగా కనిపిస్తున్నా, ఈ ప్రాంత ప్రజలు పడుతున్న అవస్థలను చూస్తే..ఔరా..! అని ముక్కన వేలేసుకుంటాం. కాలిబాట కూడా కనిపించని ఈ దారి నుంచే గ్రామస్తులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇలా సమతల ప్రాంతం నుంచి ఏడు కి.మీ పాటు నడిస్తే గాని కొండజర్త గ్రామానికి చేరుకోం. తాగునీరు, విద్యుత్తు, అంగన్వాడీ,పాఠశాల వంటి పదాలను వీళ్లు వినడమే తప్పా, వారు చూసింది లేదు. గ్రామంలోని మగవారు మాత్రం 12 కి.మీ దూరం ప్రయాణించి, నిత్యవసర వస్తులు తెస్తుంటారు. దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబందించిన ఏ ఒక్క విభాగం అధికారి కూడా కొండజర్తకు రాలేదంటే, ఆశ్చర్యం వేస్తుంది. ఇక గర్భిణీలకు ఆ సమయం ఒక చావుబ్రతుకులతో కూడిన సమస్య. బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహరం కావాలంటే, 12 కి.మీ దూరంలో ఉన్న కాకనూరు రేషన్ డిపో, అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లాల్సిందే. చివరకు అగ్గిపెట్టె కావాలన్న కాకనూరుకు రావల్సిందేనని గిరిపుత్రులు అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఆవాసాలు అనేకం ఉన్నాయని, వారి పరిస్థితి కూడా ఇంతేనని గిరిజనులు వాపోతున్నారు. తమకు కనీసం రహదారి సౌకర్యమైనా కల్పించాలని వారు వేడుకుంటున్నారు. సదుపాయాలపై అధికారులకు వినతులు ఇచ్చినా ఎటుంవంటి స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:అంతర్జాతీయ ప్రమాణాలతో 'టెన్సైల్ ఫ్యాబ్రిక్ షెడ్'