public rice to the black market: రెక్కాడితేగానీ డొక్కాడని, చిరు వ్యాపారులు, బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ప్రజాపంపిణీ బియ్యం అక్రమార్కులకు కామధేనువుగా మారింది. పేదల ఆకలి తీర్చాల్సిన ప్రజాపంపిణీ బియ్యం నల్లబజారుకు చేర్చి విపరీతంగా లబ్ధిపొందుతున్నారు. ఏపీలో ప్రజల ఇళ్లకు చేరాల్సిన ప్రజాపంపిణీ బియ్యం పొరుగు రాష్ట్రాలకు, దేశాల సరిహద్దులు దాటిపోతున్నాయి. ప్రజాపంపిణీ బియ్యం అక్రమార్కుల పాలు కాకుండా నిరోధించడంలో పౌరసఫరాల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రజాపంపిణీ బియ్యం పంపిణీతో పేదల సంక్షేమానికి తోడుపడాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యం నీరుగారిపోతోంది.
రాష్ట్రాలు,దేశాల ఎల్లలు దాటిస్తున్నారు..: పేదలకు అందాల్సిన ప్రజాపంపిణీ బియ్యం అక్రమంగా రాష్ట్రాలు,దేశాల ఎల్లలు దాటి పోతున్నాయి... రేషన్ బియ్యాన్ని కొని రీసైకిలింగ్ చేసి అధిక ధరలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసి ఇబ్బడి ముబ్బడిగా అక్రమంగా సంపాదిస్తున్నారు. అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని ఆదాయవనరుగా మార్చుకున్నారు...
గంజాయికితోడు బియ్యం..: ``అగ్గిపుల్ల... సబ్బుబిళ్ళ... కాదేది.. నల్లబజారుకు తరలించడానికి అనర్హం’’ అన్నట్లు తయారైంది.. అక్రమార్కుల దందాకు బియ్యం కూడా తోడయింది. ఏపీలోఒకపక్క ఇసుక దందా, మరోపక్క గంజాయి రవాణా...కొన్నాళ్లుగా ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు... పోలీసులు నిరంతరం దాడులు చేస్తున్నా.... చీకటి వ్యాపారం మూడు పువ్వులు...ఆరు కాయలు అన్న చందంగా జరిగిపోతూనే ఉంది... పట్టుకుంటే ఏముందిలే మహా అయితే ఓ తేలికపాటి కేసే కదా... అని అక్రమ వ్యాపారాలు మరింత జోరుగా చేసుకుపోతున్నారు...
చినగంజాం మండలం పట్టుబడ్డ బియ్యం..: బాపట్లజిల్లాలో నవంబరు 10 వతేదిన అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టికున్నారు. చినగంజాం మండలం కడవకుదురు వద్ద రెండు టాటా ఏసీ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ ఫార్సు మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
165 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం..: బాపట్లజిల్లాలో డిశెంబర్ నెలలో కారంచేడు మండలం స్వర్ణలో అక్రమంగా నిలువఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సుమెంట్ అధికారులు పట్టుకున్నారు. లారీలో వచ్చిన 43 బస్తాలు,ఒక మిల్లులో నిలువ ఉంచిన 122 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జమ్ములపాలెంలో 80 బస్తాలు..: బాపట్లజిల్లాలో నవంబర్ 13న బాపట్ల మండలం జమ్ములపాలెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 80 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చినగంజాం మండలం కడవకుదురులో..: బాపట్లజిల్లాలో 2022లో నవంబర్ 9న అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాదహీయనం చేసుకున్నారు. చినగంజాం మండలం కడవకుదురు వద్ద రెండు టాటా ఏసీ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 400 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ ఫార్సు మెంట్ అధికారులు పట్టుకున్నారు. అయినా మరోసారి ప్రజాపంపిణీ బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలించడానికి సిద్ధపడటం అక్రమార్కుల బరితెగింపునకు నిదర్శనం.
200 బస్తాల రేషన్ బియ్యం ఏ రేషన్ షాపువి..: తాజాగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు... పందిళ్ళపల్లి నుండి రేషన్ బియ్యం తరలివెళుతున్నాయనే పక్కా సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు అర్ధరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు...డి.ఎస్.ఓ విలియమ్స్, సివిల్ సప్లే డిప్యూటీ తహశీల్దార్ ఓంకార్ లు మినీ లారీని అపి తనిఖీ చేశారు.... లారీలో సుమారు 200 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి వాహనాన్ని వేటపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు...అయితే ఈ బియ్యం ఏ రేషన్ దుకాణం నుండి ఎక్కడకు తరలిస్తున్నారు అనే వివరాలు సేకరిస్తున్నారు...
నామమాత్రపు కేసులు..: ప్రజాపంపిణీ బియ్యం ఎన్నిసార్లు అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డా... అధికారులు 6ఏ కేసు నమోదు చేయటంతో అక్రమార్కులకు చీమకుట్టినట్లుగా ఉండటం లేదు.. బలమైన కేసులు శిక్షాలూ లేకపోవడంతో ప్రజాపంపిణీ బియ్యం రవాణాకు సానుకూలంగా మారింది. ఫలితంగా ప్రజాపంపిణీ బియాన్ని తరలించడంలో అక్రమార్కులు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తేగానీ కొంతవరకైనా అడ్డుకట్టవేయవచ్చని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి