చిత్తూరు జిల్లా కడియాల కుంటలో బ్లాస్టింగ్ (blasting in quarry ) జరిగి వ్యక్తి మృతికి మంత్రి పెద్దిరెడ్డి ( minister peddireddy ramachandra reddy) కారణమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) ఆరోపించారు. ఆ క్వారీని మూసేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
"మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీలో జరిగిన పేలుడుకు జాకీర్ అనే యువకుడు మృతిచెందడం బాధాకరం. పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేయటంతో పాటు, మృతుని కుటుంబానికి రూ.50లక్షల రూపాయల పరిహారం మంత్రి వ్యక్తిగతంగా ఇవ్వాలి. తక్షణమే క్వారీని మూసివేసి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. గనులశాఖ మంత్రి క్వారీలోనే రక్షణ చర్యలు లేవంటే మిగిలిన చోట్ల ఎంత దారుణ పరిస్థితి ఉందో అర్థమవుతోంది. మామిళ్లపల్లిలో వైకాపా నేత సి.రామచంద్రయ్య క్వారీలో జరిగిన పేలుడులో పదిమంది పేదలు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే మంత్రి పెద్దరెడ్డి క్వారీలో పేలుడు సంభవించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం" అని అచ్చెన్న దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
చిత్తూరు: పీఎల్‌ఆర్ కంపెనీ కంకర క్వారీలో పేలుళ్లు, ఒకరు మృతి