- ఆనందయ్య మందు నివేదికలో ఏముంది..!
ఆనందయ్య ఔషదంపై నేడు ఆయుష్ నివేదిక వెలువడనుంది. ఆనందయ్య మందు వాడిన వారికి ఎటువంటి నష్టం కలగలేదని ఆయుష్ ఉన్నతస్థాయి అధికారుల బృందం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పడు తుది నివేదికలో ఏముంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాష్ట్రంలో 808 బ్లాక్ ఫంగస్ కేసులు
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటివరకు 808 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్ల కొరత కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న ఇంజక్షన్ల నిల్వలు సరిపోవని వైద్యాధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చిత్తూరు జిల్లా పరువు హత్య కేసు: నిందితులు అరెస్టు
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో శుక్రవారం వెలుగుచూసిన పరువు హత్య కేసులో.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అనాథలైన చిన్నారుల డేటా కొవిడ్ పోర్టల్‌లో!
కరోనా సమయంలో అనాథలైన చిన్నారుల వివరాలను కొవిడ్-19 పోర్టల్‌లో నమోదు చేయాలని కేంద్రపాలిత ప్రాంతాలను, రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆదేశించింది. కొవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సమాచారాన్ని పోర్టల్‌లో నమోదుచేయాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- పాక్‌లో కశ్మీర్ ప్రస్తావనపై భారత్ మండిపాటు
పాకిస్థాన్ పర్యటనలో భాగంగా కశ్మీర్‌పై ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వేదికపై ఆయన స్థాయి దిగజార్చే విధంగా ఉన్నాయని ఘాటుగా స్పందించింది. అధ్యక్షుడి వ్యవహార తీరు పట్ల విచారం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- దేశీయ విమాన ప్రయాణాలు మరింత ప్రియం
దేశీయ విమాన సేవలు అందించే సంస్థలు ఛార్జీలను 15 శాతం వెసులుబాటు కల్పించుకోవచ్చని పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. జూన్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- టీకా తీసుకోండి రూ.840 కోట్లు గెలుచుకోండి!
అమెరికాలోని కాలిఫోర్నియా సర్కారు వ్యాక్సినేషన్లో(coronavirus vaccine) వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. టీకా తొలి డోసు తీసుకున్న వారికి 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840 కోట్ల) లక్కీ డ్రాలో ఛాన్స్ ఇస్తామని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఈనెలలో 15వ సారి పెరిగిన చమురు ధరలు
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.93.94కి చేరింది. ఒక్క మే నెలలోనే 15 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రెట్రో లుక్ జెర్సీతో టీమ్ఇండియా
జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో(WTC final) కొత్త జెర్సీ ధరించి ఆడనుంది టీమ్ఇండియా. ఇది 1980లో భారత జట్టు ధరించిన జెర్సీని(Retro Jersy) పోలి ఉంది. దీన్ని స్టార్ ఆల్‌రౌండర్ జడేజా పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- శిరీష్, అను కెమిస్ట్రీ మామూలుగా లేదుగా!
అల్లు శిరీష్(allu sirish) , అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. శిరీష్ పుట్టినరోజైన మే 30న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో విడుదల చేస్తోన్న ప్రీ లుక్‌లు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి