ETV Bharat / state

TTD Restrictions to Piligrims: శ్రీవారి భక్తులను కలవరపెడుతున్న టీటీడీ ఆంక్షలు.. ఆ సమయంలో వారికి నో ఎంట్రీ - Girl killed in Leopard Attack

TTD Restrictions to Piligrims: తిరుమలలో దర్శనానికి వెళ్లే భక్తులను చిరుతల సంచారం భయపెడుతోంది. నెలరోజుల వ్యవధిలోనే చిన్నారులపై రెండుసార్లు దాడి చేయటంతో.. తితిదే అప్రమత్తమైంది. ఈ క్రమంలో కాలినడక మార్గంలో భక్తులపై ఆంక్షలు విధించింది. అయితే అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

TTD_Restrictions_to_Piligrims
TTD_Restrictions_to_Piligrims
author img

By

Published : Aug 14, 2023, 7:15 AM IST

TTD Restrictions to Piligrims: శ్రీవారి భక్తులను కలవరపెడుతున్న టీటీడీ ఆంక్షలు

TTD Restrictions to Piligrims: తిరుమలేశుడి దర్శనానికి వెళ్లే భక్తులను చిరుతల సంచారం భయపెడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే చిరుతలు రెండు సార్లు నడకదారిలో చిన్నారులపై దాడికి తెగబడడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ క్రమంలో కొన్ని ఆంక్షలు విధించింది. అయితే భద్రతా చర్యల పేరుతో విధిస్తున్న ఆంక్షలు.. భక్తులను మరింత కలవరపెడుతున్నాయి. స్వామి సన్నిధికి కాలినడకన వెళ్లే వారితో పాటు తిరుమలకు ద్విచక్ర వాహనాల్లో వెళ్లే ఉద్యోగులు, స్థానికులపై ఆంక్షల ప్రభావం కనిపిస్తోంది.

Chirutha Attack on Girl: అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి

అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల లక్షిత రెండు రోజుల క్రితం మృతి చెందడం.. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా వైఫల్యమని భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా టీటీడీ.. నడకదారి భక్తులను ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అటవీ విభాగం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. కాలినడక మార్గంలోని అలిపిరి నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలలో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. 15 ఏళ్ల లోపు చిన్నారులకు చేతికి ట్యాగ్‌లను అతికించి తిరుమలకు అనుమతిస్తున్నారు.

Girl killed in Leopard Attack: తిరుమల నడకదారిలో తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న చిరుత

అలిపిరి కాలిబాట మార్గంలో చిరుతల సంచారంపై స్పష్టత వచ్చిన వెంటనే.. గతంలోని ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. 15 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కాలినడకన అనుమతిస్తున్నారు. తిరుమల రెండు ఘాట్‌ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నారు.

TTD Restrictions on Children Below 15 Years: తిరుమల మెట్లమార్గంలో 15 ఏళ్లలోపు పిల్లలకు.. ఆ టైం దాటితే బంద్!

కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులను గుంపులు గుంపులుగా పంపేలా అధికారులు భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఆంక్షలతో ఆదివారం మధ్యాహ్నం నుంచి అలిపిరి కాలిబాట మార్గంలో భక్తుల సందడి తగ్గింది. ముందస్తు సమాచారం లేకుండా విధిస్తున్న ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నామని భక్తులు చెబుతున్నారు. క్రూర మృగాల సమస్య పరిష్కారమయ్యే వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భక్తుల భద్రతాంశాలపై పోలీస్‌ యంత్రాంగంతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ప్రకటించింది.

"స్వామివారి దర్శనం కోసం మా పిల్లలు, పేరెంట్స్​తో కలిసి మేము వచ్చి.. పైన రూమ్ తీసుకున్నాము. శ్రీవారి కాలినడక దర్శనం కోసం మేము కిందకి వచ్చాము. అయితే 15 ఏళ్లలోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 వరకు మాత్రమే అనుమతి ఉందని మేము కిందకి ఇక్కడికి వచ్చాక చెప్పారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు విధిస్తున్న ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నాము. భద్రతా చర్యల పేరుతో టీటీడీ విధిస్తున్న ఆంక్షలు.. మరింత కలవరపెడుతున్నాయి" - శ్రీవారి భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.