RAYALASEEMA TDP LEADERS MEETING: రాయలసీమ అభివృద్ధి, హక్కుల రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలలో ఏమీ చేయలేదని సీమ జిల్లాల టీడీపీ నేతలు ఆరోపించారు. రేణిగుంటలో నిర్వహించిన రాయలసీమ అభివృద్ధి, హక్కుల రక్షణ కోసం సీమ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశంలో టీడీపీ జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాయలసీమకు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మోసాలపై 30 తీర్మానాలు చేశామని టీడీపీ నేత కాలవ శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ఏర్పడి మూడున్నర సంవత్సరాలైన రాయలసీమ ప్రాజెక్టులు ముందుకు సాగలేదన్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి రాయలసీమ ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు.
రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. కనీసం ఒక కాలువ తవ్వలేదు,.. రోడ్డు వేయలేదని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. తెలుగుగంగా, గాలేరి-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నికరజలాలు కావాలని హడావుడి చేసి అధికారంలోకి రాగానే.. చివరకు మిగుల జలాలను పాలకులు వదిలేస్తున్నారని విమర్శించారు.
"సుమారు 30 తీర్మానాలను ఈ సమావేశంలో ఆమోదించుకున్నాము. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, విద్య, వైద్యంలాంటీ కీలకరంగాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం, చేస్తున్న ద్రోహం. కుహనా మేధావులను ఒకటే అడుగుతున్నా.. మూడున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి కట్టని ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలేదు. జగన్ వల్ల పారిపోయిన పరిశ్రమల గురించి మీరు ఏనాడూ మాట్లడలేదు. మీరు మేధావులా.. మేధావుల్లా ముసుగు వేసుకున్న జగన్మోహన్రెడ్డి కూలీలా." -కాలవ శ్రీనివాసులు, టీడీపీ నేత
ఇవీ చదవండి: