ETV Bharat / state

నింగిలోకి రాకెట్‌.. జాడలేని ఉపగ్రహాలు.. నిరుత్సాహపరిచిన చిన్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ - ఎస్​ఎస్​ఎల్​వీ శ్రీహరికోట

SSLV D1 launch: తక్కువ ఖర్చుతో చిట్టి ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేలా రూపొందించిన ఎస్​ఎస్​ఎల్​వీ ఇస్రో శాస్త్రవేత్తలను నిరాశపరిచింది. తుది దశలో వాహకనౌక నుంచి పే లోడ్లు విడిపోయిన తర్వాత రాకెట్‌ నుంచి ఎలాంటి సమాచారం శాస్త్రవేత్తలకు అందలేదు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి1 వైఫల్యంపై అధ్యయనం చేసేందుకు విశ్లేషణ కమిటీని నియమించడంతో వారు అన్ని కోణాల్లో క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత నివేదికను సమర్పించనున్నారు.

ఇస్రో
ఇస్రో
author img

By

Published : Aug 8, 2022, 5:10 AM IST

SSLV D1 launch: చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి1) ఆదిలోనే శాస్త్రవేత్తలను నిరాశకు గురి చేసింది. తక్కువ ఖర్చుతో చిట్టి ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ వాహకనౌకకు ఇస్రో రూపకల్పన చేయగా తొలి ప్రయత్నంలోనే వైఫల్యం ఎదురైంది. ఏడున్నర గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లింది. రాకెట్‌ బయల్దేరిన 13 నిమిషాల తర్వాత అది ఉపగ్రహాలను 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ తుది దశలో వాహకనౌక నుంచి పే లోడ్లు విడిపోయిన తర్వాత రాకెట్‌ నుంచి ఎలాంటి సమాచారం శాస్త్రవేత్తలకు అందలేదు. వాహకనౌకలోని మూడు దశలు చక్కగానే పనిచేశాయి. తదనంతర దశలో అది నిర్దేశిత పథం నుంచి కొంత పక్కకు మళ్లింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే 'వెలాసిటీ ట్రిమ్మింగ్‌ మాడ్యూల్‌' (వీటీఎం) పనిచేయడం శాస్త్రవేత్తలు నిర్దేశించిన దానికంటే కొంచెం ఆలస్యమైంది. ప్రయోగం జరిగిన తర్వాత 738, 788 సెకన్లలో ఉపగ్రహాలు ఒక్కొక్కటిగా విడిపోయిన కొద్దిసేపటికే మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌ను నిశ్శబ్దం ఆవరించింది. అనంతరం కొద్దిసేపటికి ఇస్రో అధిపతి సోమనాథ్‌ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి1 ప్రయోగం పూర్తయిందని, మూడు దశలు అనుకున్నట్లుగానే పనిచేశాయని వెల్లడించారు. చివరి దశలో కొన్ని డేటా నష్టాలు సంభవించడంతో రెండు ఉపగ్రహాల జాడ కనిపించలేదని, కారణాలు విశ్లేషిస్తున్నామన్నారు. త్వరలో వాటి స్థితి, వాహన పనితీరుపై పూర్తి వివరాలు తెలియజేస్తామంటూ.. మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి శాస్త్రవేత్తలతో కలిసి వెళ్లిపోయారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి1 వైఫల్యంపై అధ్యయనం చేసేందుకు విశ్లేషణ కమిటీని నియమించడంతో వారు అన్ని కోణాల్లో క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత నివేదికను సమర్పించనున్నారు.

.

అవి ఇక పనికిరావు
ఉపగ్రహాలు ఇక ఉపయోగపడవని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆ తర్వాత ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయోగంలో ఎదురైన చిన్న లోపం తప్ప.. రాకెట్‌ నిర్మాణం మొత్తం బాగా పనిచేసిందని, ప్రయోగంలో ప్రతి దశా ప్రణాళిక ప్రకారమే జరిగినందుకు శాస్త్రవేత్తలంతా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఉపగ్రహాలను వృత్తాకార కక్ష్యకు బదులు దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టిందని, అవి ఉన్న ప్రదేశం భూ ఉపరితలానికి బాగా దగ్గరగా ఉండటంతో అవి ఎక్కువకాలం ఆ వాతావరణంలో ఉండలేవని అందులో చెప్పారు. ఉపగ్రహాలు రెండూ ఇప్పటికే కక్ష్య నుంచి కిందికి వచ్చినందున అవి ఇక ఏమాత్రం పనికిరావని తెలిపారు. లోపానికి కారణం కనుగొనేందుకు ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ చేసే సూచనలను ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలుచేస్తామని సోమనాథ్‌ అన్నారు.

.

ఐఎన్‌ఎస్‌ పనిచేయకపోవడంతోనే ప్రయోగం విఫలం
చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం చివరిదశలో ఉపగ్రహాల జాడ తెలియకపోవడానికి కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ట్రిమ్మింగ్‌ జరగకపోవడంతోనే ఉపగ్రహాల నుంచి డేటా రాలేదని తెలిసింది. సెకనుకు 7.8 కి.మీ. ఉండాల్సిన వేగం 7.3 కి.మీ.కు తగ్గిపోవడంతో ఇనర్షియల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ (ఐఎన్‌ఎస్‌) పనిచేయలేదని సమాచారం. అందుకే ద్రవరూప ఇంధనం మండలేదని తెలుస్తోంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ కొత్త ప్రయోగం కావడంతో దీనికి మినీ ఇనర్షియల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేశారు. ఇది ఎందుకు పనిచేయలేదన్న దానిపై తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

మొదటిసారి కాదు..
ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి చేపట్టిన తొలి ప్రయోగ మిషన్లలో వైఫల్యాలు గతంలోనూ ఉన్నాయి. ప్రస్తుతం అత్యంత విశ్వసనీయంగా పేర్కొనే పీఎస్‌ఎల్‌వీకి ఇలాగే జరిగింది. 1993 సెప్టెంబరు 20న పీఎస్‌ఎల్‌వీ-డి1 మొదటి ప్రయోగం సఫలం కాలేదు. 1997 సెప్టెంబరు 29న పీఎస్‌ఎల్‌వీ-సీ1 పాక్షికంగా విజయం సాధించింది. తర్వాత వరుసగా 39 ప్రయోగాలు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి. నావిగేషన్‌ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ను 2017 ఆగస్టు 31న పీఎస్‌ఎల్‌వీ-సి39 నింగిలోకి ప్రయోగించగా.. రాకెట్‌ ఉష్ణకవచం విచ్చుకోలేదు. ఉపగ్రహం ఆ కవచంతోనే ఉండిపోయి, కక్ష్యలో తిరుగుతున్నట్లు అప్పట్లో ఇస్రో వర్గాలు వెల్లడించాయి. జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 ప్రయోగాల్లోనూ వైఫల్యాలు ఎదురయ్యాయి. తర్వాత అవన్నీ విజయాలు సాధించాయి.

విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు: ఇస్రో అధిపతి
విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ తెలిపారు. ఆజాదీశాట్‌ రూపకల్పనలో భాగస్వాములైన విద్యార్థినులతో ఆయన ఆదివారం బ్రహ్మప్రకాష్‌ హాలులో ముఖాముఖి నిర్వహించారు. 8 నుంచి 12వ తరగతి విద్యార్థినులు ఉపగ్రహ రూపకల్పనలో భాగస్వాములు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. మున్ముందు మరిన్ని ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే శాస్త్ర, సాంకేతిక అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. షార్‌ సంచాలకులు ఆర్ముగం రాజరాజన్‌, ఎంఎస్‌జీ గ్రూప్‌ డైరెక్టర్‌ గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.