ETV Bharat / state

Road accidents: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి.. మరోచోట యువకుడు - Accident news

Road accidents in the state: రాష్ట్రంలో వేరు వేరు ప్రదేశాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తిరుపతి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబంలోని మగ్గురు మృతి చెందగా.. గుంటూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరోచోట ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయే క్రమంలో అదుపు తప్పి కారు లంకలోకి దూసుకు పోయి పల్టీ కొట్టిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

Road accidents in the state
Road accidents in the state
author img

By

Published : May 6, 2023, 2:26 PM IST

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని మగ్గురు మృతి.. మరోచోట యువకుడు

Road accidents in the state: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. తొట్టంబేడు మండలం కంచనపల్లికి చెందిన దయాసాగర్ రెడ్డి(58) కుటుంబం గత కొన్నేళ్ళగా శ్రీకాళహస్తి పట్టణంలో నివసిస్తున్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని తిరువన్నామలైలోని అరుణాచల గిరిప్రదక్షిణకు కుటుంబమంతా కారులో వెళ్లారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వగ్రామానికి బయలుదేరిన వారిని మినీ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. వీరు ప్రయాణిస్తున్న కారును కంచి సమీపంలో మినీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో దయాసాగర్ రెడ్డి, అతని కుమారుడు డాక్టర్ సూర్యతేజ(33), కోడలు డాక్టర్​ మౌనిక(31)లు మృతి చెందారు. భార్య మధుమతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దైవదర్శనానికి వెళ్లి మృత్యువాత పడటంతో బంధువులు కన్నీటి సంద్రంలో మునిగారు.

భార్యాభర్తలను గుద్దిన కారు.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిలోని భాకరాపేట కనుమ రహదారిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కనుమదారిలో దయ్యాలకోన మలుపు వద్ద ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలను కారు ఎదురుగా వచ్చి గుద్దింది. ఈ ఘటనలో భాకరాపేటకు చెందిన గురుప్రకాశ్(29) మృతి, అతని భార్యకు తీవ్రగాయాలు కావడంతో 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు గురు ప్రకాష్ కి వివాహమై నెల రోజులు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తిరుపతి నుంచి పీలేరు వైపు వెళుతున్న కారు భాకరాపేట నుంచి తిరుపతికి వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అదుపు తప్పి కారు లంకలోకి దూసుకు పోయిన కారు.. గుంటూరు జిల్లా మేడి కొండూరులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయే క్రమంలో అదుపు తప్పి కారు లంకలోకి దూసుకు పోయి పల్టీ కొట్టింది. పోలీసులు తెలిపిన మేరకు గుంటూరు నుంచి ముగ్గురు వ్యక్తులు వ్యక్తి గత పని నిమిత్తం కారులో పల్నాడు జిల్లా వెళ్లారు. కాసేపటికి తిరిగి బయలు దేరారు. మేడి కొండూరు మండలం పేరేచర్ల శివారు వద్దకు వచ్చారు. సమయంలో లారీ ఆటో రెండు వాహనాలు ఒక్క సారిగా ఎదురు వచ్చాయి. తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న లంక లోకి దూసుకు పోయింది. ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికి ఎలాంటి గాయాలు కాక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.