ETV Bharat / state

బ్రిడ్జ్ కం బ్యారేజ్ డిమాండ్​పై నేతలు స్పందించాలి: బైరెడ్డి - ap news

Byreddy Rajasekhar Reddy Press Meet: రాయలసీమలో బ్రిడ్జ్ కం బ్యారేజీ నిర్మించాలని.. రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా రాయలసీమ సంస్కృతిని దెబ్బతీసే విధంగా సినిమాలు తీయడం మానుకోవాలని హెచ్చరించారు.

Byreddy Rajasekhar Reddy
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
author img

By

Published : Feb 5, 2023, 8:17 PM IST

Byreddy Rajasekhar Reddy on Bridge cum Barrage : సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జ్ కం బ్యారేజీ నిర్మించాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిడ్జ్ కం బ్యారేజీ నిర్మాణం డిమాండ్​పై రాయలసీమ ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రాయలసీమ మొత్తం సంతకాలు సేకరిస్తామని చెప్పారు. రాయలసీమకు ఎంతో నష్టం జరిగిందని.. కనీసం ఇప్పటికైనా అందరూ బ్రిడ్జ్ కం బ్యారేజీ నిర్మాణం కోసం స్పందించాలని కోరారు.

రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని దుయ్యబట్టారు. దీనికితోడు రాయలసీమ ప్రాంత ప్రాముఖ్యతను, సంస్కృతిని దెబ్బతీసే విధంగా సినిమాలు తీయడం బాధాకరమన్నారు. రాయలసీమను ఫ్యాక్షన్​సీమగా చిత్రీకరించడం మానుకోవాలని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.