ETV Bharat / state

'రూ. కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత'.. ఒకరు అరెస్ట్.. మరో నలుగురు.. - 31 ఎర్రచందనం దుంగలు పట్టివేత న్యూస్

Red Sandalwood tracking: అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్ల ముఠాకు చెందిన ఓ నిందితుడిని తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి రూపాయల విలువ చేసే దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.

red sandalwood smugglers arrested
కోటి రూపాయలు విలువైన ఎర్రచందనం పట్టివేత
author img

By

Published : Apr 1, 2023, 7:56 PM IST

Red Sandalwood tracking: తిరుపతి జిల్లా పోలీసులు అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్ల ముఠాకు చెందిన ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా వెస్ట్ సబ్ డివిజన్ బాకరాపేట సర్కిల్ ఎర్రావారిపాల్యం పరిధిలో నిర్వహించిన సోదాలో 31 ఎర్ర చందనం దుంగలతో పాటు 2 కార్లను, 2 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న ఎర్ర చందనం దుంగల విలువ సుమారు కోటి రూపాయలు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పోలీసులు స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురు పరారయ్యారు. పట్టుకున్న నిందితుడిని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాకు చెందిన షేక్‍ సఫీఉల్లాగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని విచారించగా.. పరారైన నలుగురు నిందితుల వివరాలను తెలిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితులంతా అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్స్ అని, వీరు ఎర్రచందనాన్ని తీసుకుని వెళ్లి చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని బడా స్మగ్లర్లకు సరఫరా చేస్తుంటారని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం పరారైన నలుగురిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని.. అక్రమ రవాణాకు పాల్పడినా, సహకరించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.

"తిరుపతి జిల్లా పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్​ను అరికట్టేందుకు నిరంతరం పాటుపడుతున్నారు. స్మగ్లర్లు, కూలీలు, ట్రాన్స్​పోర్ట్ చేసేవారిని అరెస్టు చేస్తున్నాము. అయినా కూడా జిల్లాలో అక్కడక్కడ స్మగ్లంగ్ జరుగుతూనే ఉంది. 31 ఎర్రచందనం దుంగలను తీసుకుని కొంతమంది చెన్నైకు తరలిస్తున్నట్లు శుక్రవారం మాకు సమాచారం అందింది. దీంతో డ్వాక్రా పేట సీఐకి ఆదేశాలు ఇవ్వటంతో.. ఆయన ఎల్లమంద, ఉస్తికాలపేట రోడ్డు క్రాస్​లో చెకింగ్ చేశారు. రెడ్ సాండిల్ టాస్క్​ఫోర్స్ డీఎస్పీ కొండయ్య, ఆయన సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాలో 31 ఎర్రచందనం దుంగలు, 2 కార్లు, 2 బైక్​లు దొరికాయి. నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఒకరిని అరెస్టు చేయగా.. మరో నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుడిని విచారించగా.. పరారైన నలుగురు నిందితులు వివరాలను తెలిపాడు. పరారైన నలుగురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాం."
- పరమేశ్వర రెడ్డి, తిరుపతి ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.