Govt Primary Health Medical Centre : తిరుపతి జిల్లా డక్కిలిలో అనమ్మ అనే మహిళ ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తలపై పెద్ద గాయాలు అయ్యాయి. దీంతో సదరు బాధిత మహిళను వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ పరికరం పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ లేకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. విద్యుత్ లేకపోవడంతోనే సమస్య వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఉన్న జనరేటర్ కూడా పాడైపోయిందని తెలిపారు. దీంతో బాధిత మహిళను నెల్లూరు టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనం కూడా లేకపోవడంతో.. ప్రైవేట్ కారులో తీవ్రంగా గాయపడిన మహిళను తరలించడంతో, ఆమె బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితులను చూసిన స్థానికులు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి జంకుతున్నారనే ఆరోపణల వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: