New App For All Tirumala Information: తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ యాప్ ద్వారా అందించేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్ చేయడం మొదలు.. సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంచేలా ఈ యాప్‌ను రూపొందించే పనిలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విభాగం అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే యాప్ రూపకల్పన దాదాపు పూర్తయింది. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు.
వాస్తవానికి గతంలో గోవింద యాప్‌ను తీసుకొచ్చినా అది పూర్తిస్థాయిలో భక్తులకు ఉపయోగపడలేదు. తాజాగా దాని స్థానంలో కొత్త యాప్ రానుంది. దర్శన టోకెన్లకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టీటీడీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. కొత్తగా తీసుకొచ్చే యాప్ ద్వారా భక్తులు సులభంగా గదులు, శ్రీవారిసేవా టికెట్లను పొందేందుకు ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా ఇందులో చేయనున్నారు.
ఇవీ చదవండి: