Lokesh's 19th Day Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 19వ రోజు పాదయాత్రకు విశేశ స్పందన లభిస్తుంది. పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు మండలాల్లో పర్యటించారు. నారాయణవనం మండలం రాళ్ళ కాల్వ, గోవిందప్ప నాయుడు కండ్రిగ, కైలాసకోన రహదారి, అరణ్యం కండ్రిగ, కృష్ణంరాజు కండ్రిగ, ఐఆర్ కండ్రికల మీదుగా పాదయాత్ర సాగింది.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్: తుంబూరు ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు పాదయాత్రలో వెళ్తున్న లోకేశ్ ను కలిసి తమ సమస్యలు వివరించారు. ఎస్సీ కాలనీల్లో దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రాయితీని తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలన్న విజ్ఞప్తికి లోకేశ్ స్పందించారు. 200 యూనిట్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీ కాలనీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. వెదురు కళాకారులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో మాటామంతీలో లోకేశ్ పాల్రొన్నారు. అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి సామాజికవర్గీయులతో సమావేశమైన లోకేశ్ వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. పలమనగళంలో ముస్లిం మైనారిటీలతో మాట్లాడారు.
మరమగ్గాలకు 500 యూనిట్లు: పుత్తురు మండలం చినరాజకుప్పంలో ప్రసంగించిన ఆయన...మూడున్నరేళ్లుగా జగన్ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. నేతన్నలు, రైతులతో పాటు అన్ని వర్గాలనూ మోసం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఒక్కసాగు నీటి ప్రాజెక్టు పూర్తి చేయకుండా.. రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆక్షేపించారు. పరిశ్రమలను తరిమేసి యువతకు ఉపాధిని దూరం చేశారని లోకేశ్ ఆరోపించారు.
తిరుపతి జిల్లా టీడీపీ నేతలతో నారా లోకేశ్: నారా లోకేశ్ ను తిరుపతి జిల్లా తెలుగుదేశం నాయకులు కలిశారు. విత్తలతడుకు విడిది కేంద్రంలో నారా లోకేశ్‌ను కలిసిన టీడీపీ నాయకులు యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్, ఏర్పాట్లు తదితర అంశాల పై చర్చించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పలువురు నాయకులు యువగళం పాదయాత్రపై చర్చించారు. శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలలో పాదయాత్ర ఏర్పాట్లను లోకేశ్‌కు వివరించారు.
ఇవీ చదవండి: