AWARD: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారదను డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) స్మారక ‘గ్రంథాలయ సేవా పురస్కారం’ వరించింది. ఈనెల 20న తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరగనున్న వేడుకలో పురస్కారం అందజేయనున్నట్లు జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ తెలిపారు. ముఖ్య అతిథిగా ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డి హాజరై సేవా పురస్కారం అందజేస్తారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: