ETV Bharat / state

అమానవీయ ఘటన.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని.. మూత్రం పోసి, గుండు కొట్టి.. - Tirupati District news

Inhuman incident in Tirupati district: తిరుపతి జిల్లాలో ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నిర్ధారించుకొని, ఆవేదన చెందిన భర్త.. తన భార్య, ఆమె ప్రియుడు మృతి చెందారని సోషల్ మీడియాలో 'రిప్' అని పెట్టినందుకు చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాదు తలపై మూత్రం పోసి గుండు కొట్టిస్తూ.. వీడియోలను చిత్రీకరించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

Inhuman incident
Inhuman incident
author img

By

Published : Mar 4, 2023, 3:07 PM IST

Updated : Mar 5, 2023, 10:30 AM IST

Inhuman incident in Tirupati district: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేదన చెందిన భర్త.. తన భార్య, ఆమె ప్రియుడు మృతి చెందారని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌ను వీక్షించిన భార్య ప్రియుడు ఆగ్రహంతో రగిలిపోయి.. అతన్ని అమానుషంగా కొట్టి, మూత్రం పోసి గుండు కొట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటకు చెందిన హరికృష్ణ నాయుడు కుమారుడు వంశీ చంద్రగిరిలో అద్దె ఆటోను నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అతనికి సోషల్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి. వివాహానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆటో యజమాని అన్వర్.. వంశీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. ఆ క్రమంలోనే అన్వర్.. వంశీ భార్యతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు.

దీంతో వంశీ భార్య రెండు నెలల క్రితం.. పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ప్రియుడు అన్వర్ చెంతకు చేరింది. వంశీ బతుకు తెరువు కోసం ఆటోను వదిలి బెంగళూరులో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన భార్య అన్వర్ చెంతకు చేరిందన్న విషయం తెలిసి.. రహస్యంగా విచారణ చేశాడు. ఇద్దరికి అక్రమ సంబంధం ఉండడాన్ని నిర్ధారించుకున్నాడు. దీంతో ఆగ్రహించిన భర్త వంశీ.. ఫేస్‌బుక్‌లో తన భార్య, ఆమె ప్రియుడు అన్వర్‌ చనిపోయినట్లు 'రిప్' అని పోస్ట్ చేశాడు.

దీన్ని జీర్ణించుకోలేని అన్వర్.. తన స్నేహితుడైన హర్షా రెడ్డితో కలిసి బెంగళూరు నుండి వంశీని చంద్రగిరి మాట్లాడదాం రమ్మని పిలిపించి.. చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో తన స్నేహితుడి పొలం వద్ద కొంతమందితో కలిసి వంశీని చిత్రహింసలు గురి చేశారు. చివరకు తలపై మూత్రం పోసి గుండు కొట్టిస్తూ.. వీడియోలను చిత్రీకరించారు. అనంతరం బాధితుల్ని బెదిరించి అన్వర్ అనే వ్యక్తిపై తప్పుగా పోస్టులు పెట్టానని అందుకు ప్రాయశ్చిత్తంగా తానంతట తానే గుండు కొట్టించుకున్నట్లు బలవంతంగా చెప్పించారు.

వంశీని చిత్రహింసలు గురి చేస్తూ.. తలపై మూత్రం పోసి గుండు కొట్టించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో.. వీడియోలను వీక్షించిన పోలీసులు.. అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి వంశీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్​, హర్షారెడ్డిని అరెస్ట్​ చేశారు.

ఇమీ చదవండి

Last Updated : Mar 5, 2023, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.