ETV Bharat / state

Extortion in Silica: సిలికా శాండ్​ దందా.. సగం నగదు రూపంలో వసూలు - telugu news

Extortion in Silica: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక విక్రయాల్లో నగదే తీసుకుంటున్నారు. ఈ సొమ్ములో సింహభాగం ‘పెద్దల’కు చేరుతోందనేది ప్రధాన ఆరోపణ. ఇలాంటి దందాయే సిలికా శాండ్‌లోనూ నిరాటంకంగా సాగుతోంది. పెద్దఎత్తున సిలికా అక్రమ తవ్వకాలు, విక్రయాలు, రవాణా, జీఎస్టీలో మోసం జరుగుతున్నా ఏ శాఖా అటువైపు చూడటం లేదు. గనులశాఖ, ఆ శాఖకు చెందిన విజిలెన్స్‌ స్క్వాడ్‌, ప్రత్యేక కార్యదళం (ఎస్‌ఈబీ), పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వాణిజ్యపన్నులు, రవాణాశాఖ.. ఇలా అందరికీ పర్యవేక్షించే అధికారమున్నా సిలికా జోలికి పోవట్లేదు. వీరిలో కొన్ని శాఖల అధికారులకు ప్రతి నెలా కొంత మొత్తం ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి.

Extortion in Silica
Extortion in Silica
author img

By

Published : May 8, 2023, 9:14 AM IST

Extortion in Silica: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక విక్రయాల్లో నగదే తీసుకుంటున్నారు. ఈ సొమ్ములో సింహభాగం ‘పెద్దల’కు చేరుతోందనేది ప్రధాన ఆరోపణ. ఇలాంటి దందాయే సిలికా శాండ్‌లోనూ నిరాటంకంగా సాగుతోంది. సగం ఆన్‌లైన్‌లో తీసుకొని, మిగిలినది నగదుగా వసూలు చేస్తున్నారు. ఇలా నగదుగా తీసుకున్నదంతా ‘పెద్దల’కు చేరేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అందుకే సిలికా తవ్వకాలు, రవాణాలో ఏవిధమైన ఇబ్బందులు వచ్చినా.. పెద్దస్థాయిలో నేతలే నేరుగా రంగంలోకి దిగుతారు. ఇది తిరుపతి జిల్లాలో నిరాటంకంగా సిలికాలో జరుగుతున్న దోపిడీ.

వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుని..: తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లో లభించే సిలికా శాండ్‌కు డిమాండు ఉంది. దీనిని గాజు, పెయింట్ల పరిశ్రమల్లో వినియోగిస్తుంటారు. ఈ ప్రాంతంలో 76 లీజులు ఉన్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆయా లీజుల్లో ఉల్లంఘనలు ఉన్నాయంటూ గనులశాఖ అధికారులు పెద్దఎత్తున జరిమానాలు విధించారు. ఇదే సమయంలో చెన్నై మైనింగ్‌ వ్యాపారికి చెందినవారు ఇదే ప్రాంతంలో శ్రీవామన ఎంటర్‌ప్రైజెస్‌, వామన ఫ్యూచర్‌జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గామా ఎంటర్‌ప్రైజెస్‌, వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట వ్యూహాత్మకంగా.. సిలికా శాండ్‌ వ్యాపారం కోసం మినరల్‌ డీలర్‌ లైసెన్సులు తీసుకున్నారు.

ఈ నాలుగు సంస్థలకే సిలికా శాండ్‌ ఇచ్చేందుకు అంగీకరించే లీజుదారులకు.. గనులశాఖ వేసిన జరిమానాల నుంచి ఉపశమనం కల్పించేలా చర్చలు జరిపారు. చివరకు 25 మంది లీజుదారులు దారికొచ్చారు. వీరికి టన్నుకు రూ.100-150 చొప్పున ఇచ్చి, వారి లీజుల్లోని సిలికా అంతా ఆ నలుగురు డీలర్లే తీసుకునేలా ఒప్పించారు. వెంటనే వారికి జరిమానాల బాధ తప్పిందని, వేసిన జరిమానాల్లో 10 శాతంలోపే చెల్లించేలా చూశారనే ఆరోపణలున్నాయి. అప్పటినుంచి ఆయా లీజుల్లోని సిలికా అంతా ఆ నలుగురికే చేరుతోంది. ఇంకెవ్వరికీ తీసుకునే అవకాశం లేకుండా చేశారు.

సగం నగదు ఇవ్వాల్సిందే: సిలికా శాండ్‌ టన్నుకు సీనరేజ్‌ రూ.100, కన్సిడరేషన్‌ రూ.212, జిల్లా ఖనిజనిధి రూ.30, ఖనిజాన్వేషణ ట్రస్టు (మెరిట్‌)కు రూ.2 కలిపి.. రూ.344 గనులశాఖకు చెల్లించాలి. చెన్నై వ్యాపారికి చెందిన నాలుగు సంస్థలు.. ఇతర డీలర్లకు టన్నుకు రూ.1,400-1,450 చొప్పున విక్రయిస్తున్నాయి. కానీ టన్నుకు రూ.700, దానికి 5% జీఎస్టీ రూ.35 కలిపి రూ.735కే ఆన్‌లైన్‌ చెల్లింపులు స్వీకరిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని నగదుగా తీసుకుంటున్నాయి. ఇలా ఇస్తేనే.. సిలికా సరఫరా చేస్తున్నాయి. ఇలా సిలికాలో నగదుగా తీసుకునే సొమ్మంతా కీలక పెద్దలకు చేరేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.

ఏటా సగటున అధికారికంగా 20 లక్షల టన్నుల సిలికా విక్రయాలు ఉన్నట్లు అంచనా వేస్తే.. రూ.140 కోట్ల మేర పెద్దలకు వెళ్తున్నట్లు సమాచారం. ఇదంతా అధికారికంగా పర్మిట్లు తీసుకొని విక్రయించేదానికే లెక్కగా ఉంది. ఇంకా అనధికారికంగా తవ్వి తరలించేది భారీగానే ఉంటుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన అత్యంత కీలకనేత ఈ వ్యవహారమంతా చూసుకుంటారని తెలిసింది. అందుకే తవ్వకాలు, రవాణాలో ఏ సమస్య వచ్చినా నేరుగా ఆయన నుంచే అధికారులకు ఫోన్లు వస్తాయని చెబుతున్నారు.

రూ.కోట్లలో జీఎస్టీ నష్టం: ఈ దందా వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి నష్టం వస్తోంది. విక్రయించేదానిలో సగానికే జీఎస్టీ చెల్లిస్తున్నారు. 2021-22లో 18 లక్షల టన్నులు, 2022-23లో 21 లక్షల టన్నుల సిలికాశాండ్‌కు పర్మిట్లు జారీచేసినట్లు గనులశాఖ లెక్కలు చెబుతున్నాయి. సగటున ఏటా 20 లక్షల టన్నులు అమ్మినట్లు చూసుకుంటే.. టన్నుకు రూ.700 లెక్కన 5% జీఎస్టీ రూ.35 చొప్పున రూ.7 కోట్లు వసూలవుతోంది. అదే టన్నుకు రూ.1,400 లెక్కలోకి తీసుకుంటే రూ.14 కోట్ల వరకు వచ్చేది. సగమే వస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

ఎక్కడైనా తవ్వేస్తారు: లీజు ప్రాంతాలే కాకుండా, ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూముల్లోనూ ఆ 4 సంస్థల ఆధ్వర్యంలో భారీగా సిలికా తవ్వకాలు జరుగుతున్నాయి. మోమిడి, బల్లవోలు, వెల్లపాలెం తదితర గ్రామాల్లోని దాదాపు 200 ఎకరాల మేర ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూముల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. రైతులను మభ్యపెట్టి ఎకరాకు రూ.3 లక్షలు ఇచ్చి అందులో తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కో ఎకరాలో దాదాపు 30 వేల టన్నుల మేరకు సిలికా తవ్వి, తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న లీజుల్లోనూ 2.5 మీటర్ల లోతువరకే తవ్వాలి. కానీ నాలుగు మీటర్ల లోతు వరకు తవ్వేస్తున్నారు.

ఏ శాఖకూ అక్రమాలు కనిపించవు: పెద్దఎత్తున సిలికా అక్రమ తవ్వకాలు, విక్రయాలు, రవాణా, జీఎస్టీలో మోసం జరుగుతున్నా ఏ శాఖా అటువైపు చూడటం లేదు. గనులశాఖ, ఆ శాఖకు చెందిన విజిలెన్స్‌ స్క్వాడ్‌, ప్రత్యేక కార్యదళం (ఎస్‌ఈబీ), పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వాణిజ్యపన్నులు, రవాణాశాఖ.. ఇలా అందరికీ పర్యవేక్షించే అధికారమున్నా సిలికా జోలికి పోవట్లేదు. వీరిలో కొన్ని శాఖల అధికారులకు ప్రతి నెలా కొంత మొత్తం ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సిలికా అక్రమ రవాణా, పరిమితికి మించి తీసుకెళ్తున్న తీరుపై కొందరు గత నెలలో రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓ వారంపాటు రవాణాశాఖ స్క్వాడ్‌ రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేసింది. తర్వాత ఏ ఒత్తిడి వచ్చిందో గానీ.. మళ్లీ అటువైపు వెళ్లడం మానేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.