Devotees Angry On Tirumala Annaprasadam : తిరుమలలో నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగ్గా లేదంటూ పలువురు భక్తులు తితిదే సిబ్బందిపై తిరగబడ్డారు. సోమవారం రాత్రి కొందరు అయ్యప్ప స్వాములు, సాధారణ భక్తులు అన్నదాన కేంద్రానికి వచ్చారు. సిబ్బంది వడ్డించిన అన్నప్రసాదం ఉడకలేదని, మరికొంత ముద్దగా ఉందని చెబుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న తితిదే ఉద్యోగి చెంగల్రాయులుతో వాగ్వాదానికి దిగారు.
ఆహార పదార్థాల నాణ్యతా పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన తితిదే ఈవో
Tirumala Food Quality : 'అసలు ఇది అన్నమా ఎవరూ తినలే కపోతున్నారు. మీరే చూస్తున్నారు కదా ఎంత మంది ఆకుల్లో వదిలేశారో దారుణంగా ఉంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదానం సూపరింటెండెంట్, ఏఈవోను పిలవాలంటూ గొడవకు దిగారు. చలికి అన్నం ఆరిపోయి అలా అయ్యిందని ఉద్యోగి చెప్పగా, భక్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. భక్తులు రూ. కోట్లలో కానుకలు సమర్పిస్తుంటే నాణ్యమైన అన్నం అందించలేరా అంటూ మహిళలు ప్రశ్నించారు. అన్నప్రసాదాలను వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.
అత్యంత ధనిక దేవస్థానం వద్ద పరిహారం చెల్లించడానికి సొమ్ములేదా? : టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం
తరచూ ఫిర్యాదులు, మిల్లర్ల నుంచి కొనుగోలేదీ?
అన్నప్రసాదం నాణ్యతపై తితిదే అధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. తితిదే డయల్ యువర్ ఈవో, సోషల్ మీడియా వేదికగా కొందరు ఇదే విషయమై తరచూ ప్రస్తావి స్తుండటంతో ప్రస్తుత గుత్తేదారుల నుంచి కాకుండా మిల్లర్ల నుంచి కూడా నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. ఆ దిశగా ఇంకా అడుగులు ఇప్పటికి పడలేదు. బియ్యం నుంచి నిత్యావసర సరకుల వరకు ల్యాబ్లో తనిఖీ చేయిస్తామని తితిదే చెబుతున్నా నాణ్యతపై విమర్శలు మాత్రం తప్పడం లేదు.
దాతల విరాళాలు ఏమవుతున్నాయో తెలపాలి: నారా లోకేశ్
Lokesh Criticism of Annaprasad in Tirumala : కళ్ళకు అద్దుకుని, శ్రీవారే అందించినదిగా భావించే అన్నప్రసాదం ఇప్పుడు అధ్వానంగా మారిందని, వైసీపీ నాయకులు దేవుడి ప్రసాదంలోనూ అవినీతి చేస్తున్నారని టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో భోజన నాణ్యతపై భక్తుల ఆందోళన కొండపై అవినీతికి నిదర్శనమని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. 'తిరుమలలో 1985లో ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నప్రసాద శాలలు వైసీపీ సర్కారు వచ్చాక అవినీతి కేంద్రాలుగా మారాయని విమర్శించారు. లక్షల మంది దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతున్నాయో సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు. చిరుతపులి చంపిన చిన్నారి తల్లిదండ్రులకు కోర్టు పరిహారం చెల్లించాలని ఆదేశించినా, ఇప్పటికీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం వచ్చే తితిదే వద్ద రూ.5 లక్షలు కూడా లేవా అంటూ లోకేశ్ మండిపడ్డారు.
-
తిరుమల-తిరుపతిలో ప్రసాదం కంటే పరమపవిత్రంగా భావించే అన్నప్రసాదాన్ని నాసిరకంగా పెడుతున్నారు. దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతున్నాయి?
— Lokesh Nara (@naralokesh) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
నాసిరకమైన అన్నప్రసాదాలు అందిస్తూ భక్తుల మనోభావాలు గాయపరుస్తూ, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అవినీతి గద్దలను ఈ వైసీపీ సర్కారు కాపాడ… pic.twitter.com/k0WJi8EmcF
">తిరుమల-తిరుపతిలో ప్రసాదం కంటే పరమపవిత్రంగా భావించే అన్నప్రసాదాన్ని నాసిరకంగా పెడుతున్నారు. దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతున్నాయి?
— Lokesh Nara (@naralokesh) December 5, 2023
నాసిరకమైన అన్నప్రసాదాలు అందిస్తూ భక్తుల మనోభావాలు గాయపరుస్తూ, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అవినీతి గద్దలను ఈ వైసీపీ సర్కారు కాపాడ… pic.twitter.com/k0WJi8EmcFతిరుమల-తిరుపతిలో ప్రసాదం కంటే పరమపవిత్రంగా భావించే అన్నప్రసాదాన్ని నాసిరకంగా పెడుతున్నారు. దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతున్నాయి?
— Lokesh Nara (@naralokesh) December 5, 2023
నాసిరకమైన అన్నప్రసాదాలు అందిస్తూ భక్తుల మనోభావాలు గాయపరుస్తూ, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అవినీతి గద్దలను ఈ వైసీపీ సర్కారు కాపాడ… pic.twitter.com/k0WJi8EmcF
అత్యున్నత ప్రమాణాలు : తితిదే ఛైర్మన్
తిరుమలకు రోజూ వచ్చే భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల గొడవ నేపథ్యంలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో తితిదే మెుదటి స్థానంలో నిలుస్తుందన్నారు. కొందరు మాత్రమే మిగిలిన భక్తులను రెచ్చగొట్టేలా మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందన్నారు. పొర పొట్లు ఉంటే సరిదిద్దుకుంటామని తెలిపారు.