Deputy CM Narayanaswamy: తిరుపతిలో ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్యమేళా ఘోరంగా విఫలమైంది. రోగులకు పరీక్షల నిర్వహణ కోసం.. 23 కేంద్రాలు ఏర్పాటు చేసినా ఒక్కరు కూడా రాలేదు. దీంతో ఆరోగ్యమేళా ప్రారంభోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. అధికారుల వైఫల్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క రోగి కూడా రాకపోవడం.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
సీఎం జగన్ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని.. కానీ ఆరోగ్య శాఖ అధికారులు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని నిర్లక్ష్యంగా నిర్వహించారని.. ఇకనైనా అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: