ETV Bharat / state

సీఎం విధ్వంసకారుడైతే రాష్ట్రం నాశనమవుతుంది: చంద్రబాబు - Chandrababu Comments

CBN Ra Kadali Ra Programme: రాష్ట్రంలో తుగ్లక్​ పాలకులను తరిమివేయడానికే రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్​ ఆహంభావంతో సీనియర్​​ నేతలను కూడా లెక్క చేయడం లేదని, అవమానపరిచారని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn_ra_kadali_ra_programme
cbn_ra_kadali_ra_programme
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2024, 5:37 PM IST

సీఎం విధ్వంసకారుడైతే రాష్ట్రం నాశనమవుతుంది: చంద్రబాబు

CBN Ra Kadali Ra Programme: టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రయోగించి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు.

వెంకటగిరిలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జిల్లా మారినా వెంకటగిరి రాత మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామనారాయణరెడ్డి వంటి సీనియర్ నేతల మాటలు జగన్‌ వినరన్నారు. ఆహంభావంతో సీనియర్ నేతలను జగన్‌ అవమానపరిచారని, తుగ్లక్ జగన్ వెయ్యి తప్పులు చేశారని మండిపడ్డారు.

చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన వైఎస్సార్​సీపీ నేతలు

తుగ్లక్ పాలకుడిని తరిమేయడానికే 'రా కదలిరా' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం విధ్వంసకారుడైతే రాష్ట్రం నాశనమవుతుందని. జగన్ పోవాలని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు డెన్‌గా వైఎస్సార్​సీపీ మారిందని దుయ్యబట్టారు

తిరుమలను అక్రమాలకు అడ్డాగా మార్చారని, అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తిరుమల భక్తుల కోసం గరుడ వారధి తీసుకోస్తే జగన్‌ గంజాయి తెచ్చారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జగనన్న కాలనీల పేరుతో తక్కువ విలువగల భూమిని కొనుగోలు చేసి ఎక్కువ మొత్తానికి విక్రయించారని మండిపడ్డారు. గూడూరులో 4500 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేశారని ఆరోపించారు.

వైఎస్సార్​సీపీ నీచపు రాజకీయాలు - ప్రతిపక్షల నేతలపై కేసులే లక్ష్యంగా పాలన

జగన్‌ రాజకీయ వ్యాపారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందర్ని పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. టీడీఆర్ బాండ్లతో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. 25 వేల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి వైఎస్సార్​సీపీ నేతలు తెర లేపారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు. 82 రోజుల్లో ఈ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం దిగిపోనుందని చంద్రబాబు అన్నారు. జీతాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులు జైలుకు వెళ్లే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కులానికి చెందిన వారైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. 25 ఏళ్ల క్రితం తాను యువతకు ఐటీ అనే ఆయుధం ఇచ్చానని గుర్తు చేశారు. తాను ఇచ్చిన ఐటీ ఇప్పుడు వజ్రాయుధమైందని వివరించారు.

'రా కదలిరా' అని పిలుపు ఇస్తే వెంకటగిరి గర్జించిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రాజకీయ దృశ్యం మారిపోతోందని, వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటగిరి తలరాత మారిందా అని నిలదీశారు. వైఎస్సార్​సీపీలో ఉండే ఆనం, జగన్ పాలన బాగోలేదని చెప్పారని గుర్తు చేశారు. ఆనం రాంనారాయణరెడ్డికి రాజకీయ చరిత్ర ఉందని, ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టేశారని వివరించారు. సీనియర్లను కూడా లెక్క చేయని అహంకారం జగన్‌దని చంద్రబాబు మండిపడ్డారు. తుగ్లక్‌ సీఎం వెయ్యి తప్పులు చేశారని, ఇంకా భరిస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు ప్రయోగించాలని సూచించారు.

వైఎస్సార్సీపీకి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయ్యింది - రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.