శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం గుజరాతీపేటకు చెందిన సాయికుమార్.. ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మురికికాలువలో పడిన యువకుడిని చికిత్స నిమిత్తం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అయితే గురువారం రాత్రి వైద్య సేవలు అందకపోవడంతో... మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలోని క్యాజువాల్టీ తలుపుల, అద్దంతో పాటు ఈసీజీ యంత్రం, తదితర సామగ్రిని మృతుడి బంధువులు ధ్వంసం చేశారు. 15 రోజుల క్రితం సాయికుమార్ స్నేహితులతో గొడవ పడ్డాడని... దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రిలో యువకుడి మృతి... బంధువుల ఆందోళన - young man dies at srikakulam sarvajana hospital
శ్రీకాకుళంలోని సర్వజన ఆసుపత్రిలో చికిత్స అందకపోవటంతో సాయికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేశారు.
![శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రిలో యువకుడి మృతి... బంధువుల ఆందోళన young man dies for not receiving treatment at srikakulam sarvajana hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6146267-936-6146267-1582234484767.jpg?imwidth=3840)
శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం గుజరాతీపేటకు చెందిన సాయికుమార్.. ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మురికికాలువలో పడిన యువకుడిని చికిత్స నిమిత్తం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అయితే గురువారం రాత్రి వైద్య సేవలు అందకపోవడంతో... మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలోని క్యాజువాల్టీ తలుపుల, అద్దంతో పాటు ఈసీజీ యంత్రం, తదితర సామగ్రిని మృతుడి బంధువులు ధ్వంసం చేశారు. 15 రోజుల క్రితం సాయికుమార్ స్నేహితులతో గొడవ పడ్డాడని... దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:పెళ్లింట కోడి కూర చిచ్చు... రెండోసారి వడ్డించలేదని ఘర్షణ