OTS PROBLEM: ఓటీఎస్ కింద బకాయి చెల్లించాలని అడిగిన సచివాలయ సిబ్బందికి శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కురిడింగిలోనూ చేదు అనుభవం ఎదురైంది. ఇళ్లు గడవటమే కష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పదివేలు ఎలా కట్టాలని డోల సంపూర్ణమ్మ అనే మహిళ నిలదీసింది. ఇంటికి తాళం వేస్తే... రోడ్డుపైనైనా ఉంటాంకాని... డబ్బు కట్టే స్థోమత లేదని తెగేసి చెప్పింది. ఇటీవల జరిగిన ఈ ఘటన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.
ఇదీ చదవండి: రేపు గుడివాడలో తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటన