శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఆవేటి బలరాంపురానికి చెందిన బాకి కుమారి 108లోనే ప్రసవించింది. రెండవ కాన్పు కోసం పురిటి నొప్పులతో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి వెళ్లింది. గర్భంలో శిశువు పెద్దదిగా ఉండటంతో ప్రసవం కష్టమని వైద్యులు నిర్ధరించారు.
బ్రహ్మపురం వైద్యకళాశాలకు ఆమెను అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది చాకచక్యంగా ప్రసవం చేయడంతో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పురుడుపోసిన ఉద్యోగులను ఆమె బంధువులు అభినందించారు.
ఇదీ చదవండి: