ETV Bharat / state

కొవిడ్ టీకా సురక్షితం : ఉపముఖ్యమంత్రి ధర్మాన - శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు

ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ దంపతులు కరోనా టీకా వేయించుకున్నారు. కొవిడ్ టీకా పూర్తి సురక్షితమని, ఎవరూ ఆందోళన చెందవద్దని ధర్మాన అన్నారు. జిల్లాలోని 105 ప్రభుత్వాసుపత్రులు, 9 ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

wice cm dharmana krishnadas taken corona vaccine in srikakulam
కొవిడ్ టీకా సురక్షితం : ఉపముఖ్యమంత్రి ధర్మాన
author img

By

Published : Mar 9, 2021, 5:50 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని 105 ప్రభుత్వాసుపత్రులతో పాటు 9 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్​ను అందుబాటులో ఉంచినట్లు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కృష్ణదాస్ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపముఖ్యమంత్రి... కొవిడ్‌ వ్యాక్సిన్ సురక్షితమని, అపోహాలను వీడి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని కరోనా రహిత ఆంధ్రప్రదేశ్​గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి కృషి చేస్తున్నారని ధర్మాన వెల్లడించారు.

ఇదీచదవండి.

చిలకలూరిపేటలో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.