ETV Bharat / state

పైడిభీమవరం వద్ద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్​కు ఘనస్వాగతం - Duvvada Srinivas latest news

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్​కు రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక మొదటిసారి జిల్లాకు వస్తున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.

Welcome to mlc Duvvada Srinivas
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్​కు ఘనస్వాగతం
author img

By

Published : Mar 10, 2021, 5:06 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్​ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా జిల్లాకు వస్తున్న ఆయనకు రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద జాతీయ రహదారిపై ఘనస్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. పూల మాలలు వేసి, పుష్పగుచ్చాలు అందించి ఆహ్వానించారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆయన వెంట వాహనాలు ర్యాలీగా వెళ్లటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి: 'తెదేపా అభ్యర్థిని కులం పేరుతో దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.