శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం టి. బరంపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉంటున్నా... తాగడానికి గుక్కెడు నీరులేక ప్రజలు అల్లాడుతున్నారు. నదీ గర్భంలో ఏర్పాటు చేసుకున్న చెలమల నీరే అక్కడివారికి దిక్కయ్యాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా... తమ తలరాత మారటం లేదని బరంపురం గ్రామస్థులు వాపోతున్నారు. నీటి కష్టాలు తీర్చే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి.... చల్లని కబురు.. రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు