శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు ఆటస్థలంగా వినియోగిస్తున్న ప్రాంతాన్ని.. అధికారులు కోల్డ్ స్టోరేజ్‌కి కేటాయించారు. తాము ఆ ప్రాంతంలో రోజూ ఆడుకుంటుంటున్నామని.. ఆ ప్రాంతం కోల్డ్ స్టోరేజీకి కేటాయిస్తే తమకు ఆట స్థలం ఉండదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. కలెక్టర్‌కు చేరాలనే ఉద్దేశంతో ఓ వీడియోను రూపొందించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: మెగాస్టార్‌పై గుండెలనిండా అభిమానం.. ప్రేమను చాటేందుకు అడ్డురాని వైకల్యం!