ETV Bharat / state

అభివృద్ధి పనులకు గిరిబిడ్డల డీపట్టా భూముల సేకరణ!

author img

By

Published : Dec 6, 2020, 8:50 AM IST

వారంతా నిరుపేదలు, గిరిజన బిడ్డలు.. తరతరాలుగా నేలతల్లినే నమ్ముకొని బతుకుతున్నారు. జీడి తప్ప మరే పంటా తెలియదు.. గత ప్రభుత్వాలు వారు సాగు చేస్తున్న భూమికి హక్కు కల్పిస్తూ డీ పట్టాలు అందజేశాయి. అలా సాఫీగా సాగిపోతున్న ఆ బడుగుల జీవితాల్లో ఇప్పుడు అభివృద్ధి పిడుగొచ్చి పడింది.. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసమంటూ ప్రభుత్వం వందల ఎకరాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా డీపట్టా భూములను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగం కొద్ది రోజులుగా ముమ్మరంగా సర్వే చేపడుతోంది. దీంతో ఆ భూములపై ఆధారపడిన గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

Victims feel that they can survive if they take the lands of the depots
గిరిబిడ్డల డీపట్టా భూములే తీసుకుంటే తమకు బతుకెలా అంటూ బాధితుల ఆవేదన

త్తరాంధ్ర పరిధిలోనే అతి పెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఒకే ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలాల కోసం అన్వేషణ చేసింది అధికార యంత్రాంగం. పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో భూములున్నట్లు గుర్తించి అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ 426 ఎకరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గత రెండు నెలల్లో రెండుసార్లు సర్వే చేశారు. తాజాగా ఈనెల ఒకటో తేదీ నుంచి మరోమారు సమగ్ర సర్వే చేపడుతున్నారు. మందస, పలాస మండలాల పరిధిలోని గోపిటూరు, రామరాయి, గెడ్డూరు, చాపరాయివీధి, జన్నివీధి, పట్టులోగాం గ్రామాలతో పాటు ఉద్దానం ప్రాంతంలోని చిన్ననీలావతి, మాకన్నపల్లి, రామకృష్ణాపురం, జినగూరు, చిన్నగురుదాసుపురానికి చెందిన రైతులు భూములను సాగు చేస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు గిరిజనులే ఉన్నారు. మొత్తంగా జీడి చెట్లనే నమ్ముకుని సాగు చేస్తున్నారు.

ఎలాంటి ప్రకటన లేకుండా..

ఎలాంటి ప్రకటన లేకుండా డీ పట్టా భూముల సర్వే జరుగుతోంది. దీంతో ప్రధానంగా గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తరాల నుంచి ఇవే భూములపై జీవనం సాగిస్తున్న తమకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎకరాకు పరిహారం ఎంత చెల్లిస్తారు?, ఇతర అంశాలపై ప్రకటన చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఈ మేరకు సర్వేకు వెళ్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. గిరిజన, ఉద్దానం గ్రామాలకు చెందిన 220 మంది రైతులు భూములు సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దస్త్రాల్లో పేర్లు లేనివారూ ఎక్కువే..

రామకృష్ణాపురం డీపట్టా భూములు సాగు చేస్తున్న రైతుల్లో 30 శాతం వరకు రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు కాలేదు. సాగు చేసుకోవడం తప్ప దస్త్రాల్లో వివరాలు లేవు. దీంతో ఇలాంటి వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారుతోంది. మరో వైపు పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు చెందిన పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించుకొని రెవెన్యూ దస్త్రాల్లో పేర్లు నమోదు చేసుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని లబ్ధి పొందుతున్న సందర్భాలున్నాయి.

40 ఏళ్లుగా సాగు చేస్తున్నాం

నాకు మూడున్నర ఎకరాలు ఉంది. 40 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నాం. ఇప్పుడు వాటిని తీసుకుంటామంటున్నారు. సాగులో ఉన్న భూమికి, చెట్లకు ఎంతెంత పరిహారం చెల్లిస్తారో కూడా చెప్పడం లేదు. - కె.హేమావతి. మాకన్నపల్లి

స్పష్టత లేకపోతే ఇవ్వం

ఈ భూములే మాకు దిక్కు. మా తాతల కాలం నుంచి సాగు చేస్తున్నాం. సర్వే నంబరు 179లో మాకు 6 ఎకరాలుంది. రెండున్నర ఎకరాలకు మాత్రమే అడంగల్‌ వస్తుంది. మిగిలిన దాని గురించి ఏం చేస్తారు. సర్వం కోల్పోతున్న మాకు ప్రత్యామ్నాయంగా భూములైనా ఇవ్వాలి, ఉపాధి మార్గమైనా చూపాలి. గిరిజనులం కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. ఇవేవీ లేకుండా భూములు తీసుకుంటామంటే ప్రతిఘటిస్తాం. - సవర సందేశ్‌, గోపిటూరు

అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం

ప్రజాప్రయోజనం మేరకు భూములు అవసరం ఉంది. ప్రస్తుతం సర్వే చేస్తున్నాం. ఎవరి సాగులో ఎంత భూమి ఉందో గుర్తిస్తున్నాం. సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్‌కు పంపిస్తాం. సాగు చేస్తున్న వారికి న్యాయం జరిగేలా చూస్తాం.

-ఎల్‌.మధుసూదన్‌, తహసీల్దారు, పలాస

ఇదీ చదవండి:

పోలీస్​స్టేషన్​లో మహిళపై ఎస్సై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.