శ్రీకాకుళంజిల్లా ఆమదాలవలస శ్రీకాకుళంరోడ్ రైల్వే స్టేషన్-తిలారు రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
చేతిపై అమ్మ అని పచ్చబొట్టు రాసి ఉందని, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, వైట్ కలర్ ఫుల్ హాండ్స్ షర్టు, గడ్డము ఉందని తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవన్నారు. మృతదేహాన్ని పంచనామా కోసం శ్రీకాకుళం సర్వజన హాస్పిటల్ తరలించినట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లేదా 9490727521 నంబర్లో సంప్రదించాలని కోరారు.
ఇదీ చదవండి: కులబహిష్కరణ ఘటనపై విచారణ