Attacked on Elderly couple: శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి పంచాయతీ మొగలాయిపేట కాలనీలో వృద్ధ దంపతులపై ఇద్దరు యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వలస కూలీలైన వృద్ధులకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. వృద్ధులు చెన్నైకి వలస వెళ్లిన సమయంలో..... వారి స్థలంలో పక్కింటివారు కొంత స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న వృద్ధులు.... చెన్నై నుంచి వచ్చి ఆక్రమణదారులను నిలదీశారు. కట్టడాన్ని తొలగించాలని డిమాండు చేశారు. తమ స్థలంలో అక్రమంగా నిర్మించిన గోడను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అన్నదమ్ములు వృద్ధులపై దాడి చేశారు. వృద్ధులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలిని తహశీల్దారుతోపాటు పోలీసులు పరిశీలించారు. వృద్ధులపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: