శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ల స్థలాల పరిహారంలో నిధులు పక్కదారి పట్టాయని ఈటీవీ, ఈనాడు కథనం మేరకు ఘటనలో సంబంధం ఉన్న అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనంతరం దర్యాప్తుపై సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం పొన్నాడలో.. 25.4 ఎకరాల పేదల భూములను ఇళ్ల స్థలాల కోసం అధికారులు సేకరించారు. దళితుల పేరుతో ఉన్న మొత్తం భూమిని తీసుకున్న అధికారులు.. ఎకరాకు రూ.23 లక్షల50 వేల పరిహారాన్ని ప్రభుత్వం బాధితులకు చెల్లించింది. అందులో 24 మందికి చెందిన.. 22.88 ఎకరాలకు సంబంధించి రూ.5 కోట్ల 37 లక్షలు.. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అనంతరం కొందరు అధికారులతో చేతులు కలిపిన దళారులు.. కొంత భూమి చెరువు గర్భంలో పోయిందని కొందరికి పట్టాల్లో దస్త్రాలు లేవని వారిని నమ్మించి సొమ్మును పక్కదారి పట్టించారు. అలా ఒక్కొక్కరి ఖాతా నుంచి రూ.9 లక్షలను కాజేశారు. అయితే ఈ విషయాన్ని ఈటీవీ, ఈనాడు వెలుగులోకి తేవడంతో.. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న స్థానిక వీఆర్వో, వీఆర్ఏ లను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: