శ్రీకాకుళం జిల్లా టెక్కలి కచేరి వీధిలో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వాకాడ హరి, నందిపేట మూర్తి అనే ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపుమడుగులో ఉన్న ఇద్దరిని 108 వాహనంలో టెక్కలిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడు దాటికి సమీపంలోని ఓ ఇంటి అద్దాలు, మరోఇంటి పైకప్పు దెబ్బతిన్నాయి.
కచేరి వీధిలో ఇంటి అరుగుపై విద్యార్థులు దీపావళి బాంబులు తయారుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో హరి, మూర్తి అనే ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమీపంలో ఆడుకుంటున్న మరో బాలుడు సాయిగోపాల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. భారీ పేలుడు ధాటికి సమీపంలోని ఓ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. మరో ఇంటి పైకప్పు దెబ్బతింది. రక్తపుమడుగులో పడి ఉన్న బాలురను పోలీసులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో..ప్రాథమిక చికిత్స అనంతరం వీరిరువురిని శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించిన పోలీసులు..ఒడిశా పర్లాకిముడి నుంచి మందుగుండు సామగ్రి తెచ్చినట్లు గుర్తించారు. జాగ్రత్తలు తీసుకోకుండా బాణాసంచా తయారు చేయడమే ప్రమాదానికి కారణమని టెక్కలి ఎస్సై కామేశ్వరరావు వెల్లడించారు.
ఎలాంటి జాగ్రత్తలు లేకుండా మందుగుండు తయారీ చేయరాదని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: