జీవో నెంబర్ 3 రద్దు చేయడంపై శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలో బంద్ చేపట్టారు. గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. సీతంపేటలో బంద్ కారణంగా దుకాణాలు తెరుచుకోలేదు. జీవో నెంబర్ 3 రద్దు కారణంగా గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గిరిజనులకు తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి... : 'కేసులు పెరుగుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి'