శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో భావనపాడు పోర్టు నిర్మాణ భూములను అధికారులు పరిశీలించారు. పోర్టు నిర్మాణానికి సేకరించిన ప్రభుత్వ భూమి, సాల్ట్ ల్యాండ్, రాయితీ భూముల వివరాలను రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ తెలుసుకున్నారు. భూసేకరణ, తరలించవలసిన గ్రామాల వివరాలు, మత్స్యకారుల జీవన స్థితిగతులు, ప్రస్తుత జనాభా, తదితర విషయాల గురించి జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు.
పోర్టు నిర్మాణం వలన ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోర్టు సీఈవో శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ ఆదినారాయణ, సబ్ కలెక్టర్ గనోర్ సూరజ్ ధనుంజయ, తహసీల్దార్ రాంబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ తమ్మినేని సీతారాం