గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు తప్పా లాక్డౌన్కు ఎలాంటి మినహాయింపులు లేవన్నారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్. మండల పరిధిలో మాత్రమే కదలికలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై ప్రభుత్వ మెడికల్ కళాశాలలోనే పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ అయిపోయిన అనంతరం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెన్నై నుంచి వచ్చే మత్స్యకారులకు సముద్ర తీర ప్రాంతాల్లో 40 చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఆరు బోట్లు సీజ్ చేసి.. 82 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి..