ETV Bharat / state

కరోనా సేవకులకు అందని వేతనం - Srikakulam latest news

కరోనా బాధితులకు వారంతా ఆపద్బాంధవులయ్యారు. వైరస్ బారినపడే అవకాశమున్నా..ధైర్యంగా ముందుకొచ్చారు. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ వైద్య సేవలందించారు. తాము విధుల్లో ఉండేది కొద్దినెలలే అని తెలిసినా రేయింబవళ్లు కష్టపడ్డారు. వీరి సేవలకు ప్రశంసలే తప్ప ఒక్కరికీ జీతాలివ్వలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో తాత్కాలిక పద్ధతిలో పనిచేసిన వైద్యులు, సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Covid Employees agitation
కరోనా సేవకులకు అందని వేతనం
author img

By

Published : Jan 1, 2021, 8:18 PM IST

శ్రీకాకుళం జిల్లాలో అప్పట్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో మే నుంచి జులై వరకూ అధికారులు తాత్కాలిక వైద్యసిబ్బంది నియామకాలు చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ తరఫున మొత్తం 11 వందల 76 మందిని విధుల్లోకి తీసుకున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి, ఇతర పనులకు డ్వామా, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రాతిపదికన 16 వందల మందిని తీసుకున్నారు. రోజుకు 5 వందల నుంచి వెయ్యి కొత్త కేసులు నమోదైనప్పుడు.. వీరి సేవలు రోగులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. జిల్లాలో కరోనా మృతుల సంఖ్య.. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. అప్పటి వరకూ సేవలందించిన వారిని విడతల వారీగా ఇళ్లకు పంపించేశారు. త్వరలోనే బడ్జెట్ వస్తుందన్న అధికారులు.. ఆ వెంటనే ఖాతాల్లో వేతనం జమచేస్తామని మాత్రం బదులిచ్చారు. ఇప్పటికీ నెలలు గడుస్తున్నా ఒక్కరికి కూడా వేతనం రాలేదు. దీంతో విసిగి పలుమూర్లు నిరసనలు చేస్తున్న ఫలితం కనిపించలేదు.

ప్రైవేటు ఉద్యోగాలను వదిలి..

నోటిఫికేషన్ సమయంలో ఆరు నెలలు తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటున్నామని చెప్పి కొందరిని విధుల్లోకి తీసుకున్నారు. తర్వాత వచ్చిన వారికి మూడు నెలలేనని చెప్పారు. మంచి వేతనం.. ప్రభుత్వ కొలువు దక్కే అవకాశం అని భావించిన కొందరు.. ప్రైవేటు ఉద్యోగాలను కూడా వదిలేసి వచ్చారు. ఈ లోపు కొవిడ్ ప్రభావం తగ్గడంతో కనీసం రెండు నెలలు కూడా పనిచేయకుండానే కొందరు ఉద్యోగులు బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. బయటకు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వేతనాల బకాయిలు రాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని అవేదన వ్యక్తం చేశారు. చివరకు జీజీహెచ్‌ కొవిడ్‌ విభాగం వద్ద పీపీఈ కిట్లు ధరించి నిరసన ధర్నా నిర్వహించారు. కొవిడ్‌ సమయంలో మమ్మల్ని ఉపయోగించుకొని.. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని వాపోయారు.

త్వరలోనే వేతనాలు చెల్లిస్తాం: కలెక్టర్

వేతనాలు కోసం పలుమార్లు కలెక్టర్‌ కార్యాలయం వద్ద కొవిడ్‌ సిబ్బంది ధర్నా చేసారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని...కొద్ది రోజుల్లోనే జీతాలు వారి ఖాతాల్లో పడతాయని కలెక్టర్‌ నివాస్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కడప వైకాపాలో వర్గ పోరు...గాల్లోకి ఓ వర్గం నేత కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.